కిడ్నీలో రాళ్లు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి.
కిడ్నీ రాళ్ళలో ఉంటె విపరీతమైన నొప్పి వస్తూవుంటుంది. ఆ నొప్పిని తట్టుకోవటం చాల కష్టము గా ఉంటుంది.
మూత్రములో కొన్ని రసాయనాలు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ లో రాళ్ళూ తయారు అవుతాయి. సాధారణంగా రాళ్లు కాల్షియం,ఆక్సలేట్,ఫాస్పరస్ ఇంకా యూరిక్ ఆమ్లము వలన ఏర్పడుతుంటాయి. నేషనల్ ఇనిస్ట్యూట్ అఫ్ డయాబెటిస్ ఇంకా డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్రిలు కంటే ఎక్కవగా పురుషుల్లో కిడ్నీలో రాళ్ళూ ఎక్కువగా తయారుఅవుతాయి. పురుషుల్లో 20 నుండి 40 సంవత్సరముల లోపు వారిలో ఎక్కువ గా సమస్యలు ఉంటాయి అని తేలింది. సాధారణంగా చిన్న చిన్న రాళ్ళూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అయితే పెద్దగా ఉండే రాళ్ళూ మాత్రం మూత్ర ద్వారములో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహమును నిరోధించవచ్చు. ఇదే కాక్ పెద్ద పెద్ద రాళ్ళూ వలన మూత్ర ద్వారము దెబ్బతినే అవకాశము ఉంది.
- ఏమి చేయాలి అంటే త్రాగు నీటిని తగినంత నీటిని త్రాగకపోవటం వలన కిడ్నీలో నష్టం రావటమే కాకుండా కిడ్నీ లో రాళ్ళూ తరుచు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తగినంత నీటిని తీసుకోవటము వలన కిడ్నీ లో జీవ క్రియ వ్యర్దాలను సమర్ధవంతముగా బయటకు పంపివేస్తాయి.
- కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మనము తీసుకొనే ఆహారములో కాల్షియం తక్కువగా అయితే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడటానికి కారణం అయినా అక్స్లట్ స్ధాయి పెరుగుపోతాయి. ఆహారములో తగినంత కాల్షియం తీసుకుంటే కిడ్నీలకు వెళ్లకుండా ఇంకా రక్తములో కలువకుండా ఆక్సలేట్ ను పేగులో బంధిస్తుంది.
- ఆక్సలేట్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. అక్కసలాటే సమృద్ధిగా ఉన్న ఆహారములను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళూ వచ్చే అవకాశం పెరుగుతుంది. శరీరంలో కాల్షియం పోషణ తగ్గి అది కాల్షియం ఆక్సలేట్ గా మారి కిడ్నీ లో రాళ్లుగా తయారు అవుతాయి.
- శరీరానికి ఉప్పు తీసుకోవటము తగ్గించాలి. సోడియం అధికముగా ఉండే ఆహారములను తీసుకోవటం వలన మూత్రములో కాల్షియం కంటెంట్ పెరుగుతుంది. తద్వారా కిడ్నీలో రాళ్ళూ ఏర్పడటానికి మద్దతు కలుగుతుంది. అంతేకాక మూత్రములో ప్రోటీన్ శాతం పెరిగి మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. శరీరములో అదనంగా సోడియమును బయటకు పంపటం కిడ్నీ లకు కష్టమైన పనిగా మారుతుంది.
- సోడా మరియు కార్బొనైటెడ్ పానీయాలు త్రాగకూడదు. సోడా ఇంకా కార్బోనేటేడ్ వాటికి కిడ్నీ లో రాళ్లకు సంబంధము ఉంది. కార్బొనేటైడ్ వంటి వాటిలో ఉండే పాస్పరస్ ఆమ్లం రాళ్లుగా మారిపోయి. ఇటువంటి వాటిని త్రాగితే దీర్ఘకాలిక కిడ్నీల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.